Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వడదెబ్బతో ఒకేరోజు 9 మంది మృతి

వడదెబ్బతో ఒకేరోజు 9 మంది మృతి

మస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, మే 22 : ఎండల ధాటికి శుక్రవారం 9 మంది మృతి చెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లికి చెందిన జెల్ల లస్మయ్య (60), శంకరాంపల్లికి చెందిన సమ్మక (65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.

వరంగల్‌ రంగశాయిపేట కు చెందిన ఆటోడ్రైవర్‌ నిండ్ల సంతోష్‌ (49) శుక్రవారం ఆటోను వరంగల్‌ బ స్‌ స్టాండ్‌ వద్ద ఆపి మంచినీరు తాగుతుండగా కుప్పకూలి చనిపోయాడు.

మహబూబాబాద్‌ జిల్లా బంజరకు చెందిన సత్యం (70), గూడూరు మండలం మాచర్లకు చెందిన కొట్టెం భద్రమ్మ(60), జనగామ జిల్లా జీబీ తండాకు చెందిన రామ్‌సింగ్‌(70), వరంగల్‌ జిల్లా పర్వతగిరికి చెందిన అరుణ (45), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంగన్నపాలెంకు చెందిన మంద గోపయ్య(75), గుండాల మండలం లింగగూడేనికి చెంది న మాజీ విలేకరి జనగామ రాంబాబు(45 )ఖమ్మంలో ఆటో నడుపుకొంటూ జీవిస్తు న్నన్నాడు. గురువారం ఆ టో నడిపి తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మం దవాఖానలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉ న్నారు. పినపాక మండలం బోటిగూడెం గ్రా మానికి చెందిన సోలం మల్లమ్మ (50) రోజువారీగా తునికాకు సేకరణ వెళ్లింది. ఎండ తీవ్రతతో శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana