Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vande Mataram: ఆగస్టు 15న ఎర్రకోటపై వందేమాతరం గేయం ఆలాపన

Vande Mataram: ఆగస్టు 15న ఎర్రకోటపై వందేమాతరం గేయం ఆలాపన

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై వందేమాతరం ప్రతిధ్వనించనున్నది. 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాల వేళ.. మొట్టమొదటి సారి వందేమాతర గేయాన్ని ఎర్రకోటపై ఆలపించనున్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సంబరాల్లో ఆ గేయాన్ని పాడనున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కూడా ఈ ప్రత్యేక గీతాలాపన చేపట్టనున్నారు. ప్రధాని మోదీ ఆ రోజు ఎర్రకోటకు చేరుకోగానే.. జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఆ తర్వాత ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత దేశాన్ని ఉద్దేశించిన మోదీ ప్రసంగిస్తారు. ఈసారి యువశక్తి ఫోకస్‌తో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను నిర్వహించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో సాగే ఉద్యమోంలో భారత యువ జనాభా ఆ దిశగా తన సహకారాన్ని అందించనున్నది.

ఇటీవలే పార్లమెంట్‌లో వందేమాతరం గేయంకు సంబంధించిన బిల్లును పాస్ చేశారు. ఆ చట్టం ప్రకారం.. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తారు. వందేమాతరం పాడేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, అడ్డుకున్నా కూడా శిక్షార్హులే. వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ బిల్లును, ఆ గేయానికి గౌరవ సూచకంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బంకించంద్ర ఛటర్జీ తొలుత 1875లో వందేమాతరం గేయాన్ని రచించారు. తర్వాత తన ఆనంద్‌మఠ్‌ నవలలో ఆ గేయాన్ని చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana