Friday, 23 Apr, 2.40 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
వరంగల్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
29వ డివిజన్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తాం
గుండు సుధారాణిని భారీ మెజార్టీతో గెలిపించాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్‌ నేతలు

మట్టెవాడ, ఏప్రిల్‌ 22 : వరంగల్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వరంగల్‌ 29వ డివిజన్‌లోని సునీల్‌ గార్డెన్స్‌లో గురువారం నర్సంపేట ఎమ్మెల్యే, డివిజన్‌ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వినోద్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 29వ డివిజన్‌ చాలా వెనుకబడిన ఏరియా అని, ఈ డివిజన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుండు సుధారాణిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 24 గంటల కరంటు, తాగు నీరు, సాగు నీరు ఇస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. అంతేకాకుండా సంక్షేమ రంగంలో సైతం వెనుకడుగు వేయకుండా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యురాలిగా ఎదిగిన గుండు సుధారాణిని సీఎం కేసీఆర్‌ పిలిచి, కార్పొరేటర్‌గా పోటీ చేయమంటే వెంటనే ఒప్పుకోవడం ఆమె ఎదుగుదలకు నిదర్శనమన్నారు. డివిజన్‌కు కచ్చితంగా మంచి మోడల్‌ స్కూల్‌, 24 గంటల బస్తీ దవాఖానను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, నగరానికి మెట్రో లాంటి మోనో రైలును కూడా తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు.
పనిచేసిన వారిని పార్టీ మర్చిపోదు
పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను ఎప్పుడు కడుపులో పెట్టుకుని చూసుకుంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకున్న వారికి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసి, డివిజన్‌ అభివృద్ధి కోసం ఉపసంహరించుకుని వచ్చిన బుద్ధ లతాజగన్‌కు కోఆప్షన్‌ వచ్చేలా చూస్తామన్నారు.
కాంగ్రెస్‌ నుంచి పలువురి చేరికలు
కాంగ్రెస్‌ నాయకులు బుద్ధ జగన్‌, ఓరుగంటి పూర్ణ, ఎర్ర రాజు, సౌరం కుమారస్వామి, గొర్రె మహేశ్‌తో పాటు 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పార్టీ కండుడా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గ్యాదరి బాలమల్లు, మాజీ కార్పొరేటర్‌ గుండు ఆశ్రితావిజయ్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొడకండ్ల సదాంత్‌, రాచర్ల రాము, గట్టు చందు, తాళ్లపల్లి రమేశ్‌, ఎండీ షఫీ అహ్మద్‌, రాచర్ల జగన్‌, పూజారి కుమారస్వామి, నక్క జ్యోతి, ఫాతిమా, కాసర్ల చంద్రమౌళి, వాడిక నాగరాజు, రుద్ర శ్రీనివాస్‌, ఎల్‌ఐసీ శ్రీనివాస్‌, భీంరాజ్‌, జావిద్‌, మామునూరి రాజు, తాళ్లపల్లి శంకర్‌, మార్త కిరణ్‌, వాసు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల నరేందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సమక్షంలో కారకుల భారతి, ఏలిమి రామచందర్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గురువారం హన్మకొండ కాకతీయ కాలనీలోని వినోద్‌కుమార్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో వీరికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సాంబయ్య యాదవ్‌, రమేశ్‌, మల్లయ్య, రవి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

IPL 2021 : బెంగళూరు జోరు కొనసాగేనా?

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top