Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Venezuela | ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా వెనుజువెలా

Venezuela | ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా వెనుజువెలా

న్యూఢిల్లీ : ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అంతరాయాల మధ్య వెనుజువెలా దేశం మే నెలలో ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది.

భారతీయ రిఫైనరీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇతర రిఫైనరీలు చౌకైన వెనిజులా ముడి చమురు కొనుగోళ్లను పెంచడంతో సాంప్రదాయకంగా అగ్రగామిగా ఉన్న రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించి వెనుజువెలా భారతదేశానికి మూడవ అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించడం విశేషం.

ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్‌ డేటా ప్రకారం వెనిజులా ఈ నెలలో ఇప్పటివరకు ఇండియాకు రోజుకు సుమారు 417,000 బ్యారెళ్ల (bpd) ముడి చమురును సరఫరా చేసింది. ఇది ఏప్రిల్‌లోని 283,000 bpd కంటే ఎక్కువ. ఈ దక్షిణ అమెరికా దేశం గత తొమ్మిది నెలలుగా భారతదేశానికి ఎలాంటి ముడి చమురును సరఫరా చేయలేదు. ప్రస్తుతం వెనిజులా ముడి చమురు, ప్రపంచంలోని అనేక ఇతర చమురు గ్రేడ్‌ల కంటే చౌకగా లభిస్తుండటం, ఆకర్షణీయమైన ఆర్థిక ప్రయోజనాలతో వెనిజులా బ్యారెళ్లపై బలమైన ఆసక్తిని కనబరిచారని అని క్లెప్లర్‌లోని లీడ్ అనలిస్ట్-రిఫైనింగ్ నిఖిల్ దూబే తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana