Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి'

'వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి'

- కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరపు కనకయ్య

చుంచుపల్లి, జూలై 02 : వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు.

గురువారం చుంచుపల్లి మండలం వేంకటేశ్వర కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం వల్ల ఉపాధి కూలీల హక్కులు దెబ్బతింటాయని, నిధుల భారం రాష్ట్రాలపై పడుతుందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి తగిన బడ్జెట్ కేటాయించకుండా పనుల్లో కోత విధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు బాలకృష్ణ, పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana