- సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లేఖ
హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకోకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు.
స్వయంగా సీఎం చేతిలోనే ఉన్న ఈ శాఖకు పార్ట్‌టైమ్ శ్రద్ధ సరిపోదని, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 19 వేలకు పైగా ఖాళీలున్నా.. మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం నిరుద్యోగులను మోసగించడమేనని మండిపడ్డారు. బడుల విలీనాలు, మూసివేతపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి, విద్యా సంక్షోభ నివారణకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

