- ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విషాదం
మహ్మదాబాద్/కారేపల్లి, ఆగస్టు 1: వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందిన ఘటన శనివారం వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నది.
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన వడ్డే ఉమ (47) మధ్యాహ్నం పొలంలోని బావి వద్దకు వెళ్లగా మోటర్ కు ఉన్న విద్యుత్తు వైరు తగిలి షాక్ కొట్టడంతో పక్కనే ఉన్న బావిలో పడిమర ణించింది.
మహబూబ్‌నగర్ జిల్లా మ హ్మదాబాద్ మండలం జిన్నారానికి చెందిన కావలి పెంటయ్య(53) నారుకు నీళ్లు పారించేందుకు పొలం వద్దకు వెళ్లా డు. బోరుమోటర్ ఆన్ చేసే క్రమంలో కిందపడి ఉన్న కరెంట్ వైరు ప్రమాదవశాత్తు కాలికి తగలడంతో విద్యుత్తుషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

