Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'విఫల ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలి'

'విఫల ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలి'

- వైరా నియోజకవర్గ సర్‌ ఇన్‌చార్జ్ ఆర్‌జేసీ కృష్ణ

వైరా టౌన్, సెప్టెంబర్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, వైరా నియోజకవర్గ సర్‌ ఇన్‌చార్జ్ ఆర్‌జేసీ కృష్ణ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా వైరా తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. వికలాంగుల పింఛన్లు ఎక్కడ? మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎక్కడ? ఆడబిడ్డల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఎక్కడ? రైతు బీమా ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? అని కృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వాటి అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

బీఆర్‌ఎస్‌ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని కృష్ణ అన్నారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును అరకొరగా అమలు చేస్తోందని, రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

విద్యార్థుల పరిస్థితి దయనీయం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అందక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణ అన్నారు. గురుకుల విద్యార్థులు సైతం అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

‘విఫల ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలి’

ప్రజలే తగిన బుద్ధి చెబుతారు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని ఆర్‌జేసీ కృష్ణ స్పష్టం చేశారు. కేసీఆర్‌ తిరిగి రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి, భానోత్ మనీషా లక్ష్మి ,లక్కవత్ గిరిబాబు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు, వనమా విశ్వేశ్వరరావు, బాణా వెంకటేశ్వర్లు, మద్దెల రవి, పొట్ల శ్రీనివాసరావు, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, అప్పం సురేష్, షేక్ లాల్ మహమ్మద్, బోడపోతుల బాబు, మాజీ సర్పంచ్ భట్టా భద్రయ్య, కొత్త వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ చిలక కోటయ్య, కిలారి కిరణ్, చాపాలమడుగు రామ్మూర్తి, సీతాకుమారి, ఎదుళ్ల విరాభద్రం, మరికంటి శివ, ఏదునూరి శ్రీను, వేముల శివకృష్ణ , విలాసాగరం నరేష్, మిట్టపల్లి కిరణ్ ,తిరుపతి శ్రీను, కందుల ఓంకార్, కొల్లా రాంబాబు, నూకల ప్రసాద్, సక్కుబాయి, దేవరాజ్, కారుకొండ బోస్, పాముల వెంకటేశ్వర్లు, నల్లబోలు వెంకటరెడ్డి, వాంకుడోత్ వీరన్న, కోసూరి రామకృష్ణ, బొడ్డు రామకృష్ణ, వజినేపల్లి చక్రవర్తి, కట్టా నాగేశ్వరరావు, మిట్టపల్లి సత్యం బాబు, ఆదూరి ప్రేమ్, కామినేని శ్రీనివాసరావు, నూకల వాసు, మడుపల్లి కృష్ణ, పారుపల్లి నాగం, దొడ్డపునేని రామారావు, పనితి శాంతయ్య, మాచర్ల శంకర్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana