Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijay | ఎయిర్ హోస్టెస్‌తో విజయ్ ఫోటో వైరల్.. సీఎం అయినా అదే సింప్లిసిటీ అంటూ ఫ్యాన్స్ ఫిదా!

Vijay | ఎయిర్ హోస్టెస్‌తో విజయ్ ఫోటో వైరల్.. సీఎం అయినా అదే సింప్లిసిటీ అంటూ ఫ్యాన్స్ ఫిదా!

Vijay |తమిళ స్టార్ హీరో నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా మారిన సి. జోసెఫ్ విజయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్‌తో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ విజయ్ అందరితో కలిసిపోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ఈ టూర్‌లో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.తమిళనాడుకు కేంద్ర నిధులు, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెట్టుబడులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ పర్యటన ముగించుకుని చెన్నైకి తిరిగి వస్తున్న సమయంలో విమానంలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది.

విమాన సిబ్బందిలో పనిచేస్తున్న ఉమా మీనాక్షి అనే ఎయిర్ హోస్టెస్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ (మన తలపతి) మా ఫ్లైట్‌లో ప్రయాణించడం వల్ల ఈరోజు నా క్రూ డ్యూటీ ఎంతో స్పెషల్‌గా మారింది" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ బయటకు రావడంతో క్షణాల్లోనే ఫ్యాన్ పేజీలు, సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఫోటోలో విజయ్ తనకు సిగ్నేచర్‌గా మారిన బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ డ్రెస్సులో ఎంతో సింపుల్‌గా కనిపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి అహంకారం లేదని, సాధారణ ప్రజలతో ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

"స్టార్ హీరోగా ఉన్నప్పటి సింప్లిసిటీ ఇప్పటికీ అలాగే ఉంది", "సీఎం అయినా తలపతి మారలేదు", "ఇదే విజయ్ గొప్పతనం" అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా దశాబ్దాల పాటు అద్భుతమైన క్రేజ్ సంపాదించిన విజయ్.. 2024లో తమిళగా వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువత, అవినీతి వ్యతిరేక అజెండా, సంక్షేమ అభివృద్ధి, పారదర్శక పాలన వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లిన విజయ్.. చాలా తక్కువ సమయంలోనే భారీ రాజకీయ శక్తిగా ఎదిగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ మే 13న విశ్వాస పరీక్షలో విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana