Vijay Shankar : భారత ఆటగాడు విజయ్ శంకర్ (Vijay Shankar) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పంతొమ్మిదో సీజన్ కొనసాగుతుండగానే వీడ్కోలు ప్రకటించాడు.
ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ (Domestic cricket)కు కూడా అల్విదా చెబుతున్నట్టు విజయ్ తెలిపాడు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడీ ఆల్‌రౌండర్.
ఐపీఎల్ స్టార్‌గా వెలుగొందిన విజయ్ శంకర్ హఠాత్తుగా వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం అతడు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు, మరింత క్రికెట్ ఆడేందుకు ఈ రెండింటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాఅని విజయ్ శంకర్ పేర్కొన్నాడు. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీలకు , భారత జట్టుకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐకి అతడు ధన్యవాదాలు తెలిపాడు.
'బీసీసీఐ, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు. ఎన్నో విషయాలు నేర్చుకోవడం, లెక్కలేనన్ని జ్ఞాపకాలు పోగేసుకోడవడంతో పాటు దేశం తరఫున ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన 500వ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి తొలి బంతికే వికెట్ తీయడం నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. నా కెరీర్లలో నేను విద్వేషాన్ని, ప్రతికూల పరిస్థితులను చవిచూశాను. అయితే.. వాటిని నేను పట్టించుకోకుండా ముందుకు సాగాను. నేను అలా చేయగలిగినప్పుడు ఎవరికైనా సాధ్యమే. పాజిటివ్‌గా ఆలోచించండి. బాగా కష్టపడండి. జీవతమంటే ఏంటో క్రికెట్ ద్వారానే నేర్చుకున్నా. క్రికెట్టే నా జీవితం' అని విజయ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.
2013లో అరంగేట్రం
తమిళనాడుకు చెందిన విజయ్ 2012లో రాష్ట్ర జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. పదమూడేళ్లు సొంత జట్టుకు ఆడిన అతడు 2025-26 సీజన్‌లో త్రిపురకు మారాడు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు విజయ్. 2017లో సన్‌రైజర్స్‌కు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీతో.. ఆపై మూడేళ్లు మళ్లీ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలవడంలో విజయ్ కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా ఆటగాడిగా 2018-19 మధ్య కాలంలో 12 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడంతే. 2025లో సీఎస్కే గూటికి చేరిన విజయ్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో.. పంతొమ్మిదో సీజన్ వేలంలో అతడనిఇ ఎవరూ కొనలేదు. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

