Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌ శంకర్‌ వీడ్కోలు

విజయ్‌ శంకర్‌ వీడ్కోలు

న్యూఢిల్లీ : భారత ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఐపీఎల్‌,దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొత్త అవకాశాలకు తోడు మరింత క్రికెట్‌ ఆడాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శంకర్‌ స్పష్టం చేశాడు.

తమిళనాడుకు చెందిన ఈ 35 ఏండ్ల ఆల్‌రౌండర్‌ గత దేశవాళీ సీజన్‌లో త్రిపుర తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2018-19 మధ్య కాలంలో టీమ్‌ఇండియాకు శంకర్‌12 వన్డేలు, 9 టీ20ల్లో ఆడాడు.

ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్‌లో శంకర్‌ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంబటి రాయుడును పక్కకు పెడుతూ సెలెక్టర్లు 'త్రీడీ' ప్లేయర్‌ అంటూ శంకర్‌ను ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో శంకర్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌(2014, 15), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(2017, 19, 21), ఢిల్లీ క్యాపిటల్స్‌(2018), గుజరాత్‌ టైటాన్స్‌(2022-24) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana