Friday, 22 Jan, 1.21 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తాం

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఖిలావరంగల్‌, జనవరి 21 : గ్రేటర్‌ విలీన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. ఐదో డివిజన్‌ కార్పొరేటర్‌ పసునూరి స్వర్ణలత ఆధ్వర్యంలో డివిజన్‌లోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు వారు గురువారం శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే, మేయర్‌ మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ భూమాత, తుమ్మ రవీందర్‌రెడ్డి, ఎల్లాగౌడ్‌, నరేందర్‌, ప్రసాద్‌బాబు, పరుశరాముడు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మోడల్‌ రోడ్డు పరిశీలన

సంగెం : కుడా నిధులతో మండలంలోని కాపులకనపర్తి నుంచి కోటవెంకటాపురం గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న మోడల్‌రోడ్డును పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. 40 ఫీట్ల వెడల్పుతో మొరం పోసి, ఐదున్నర మీటర్ల వెడల్పుతో తారు వేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు పనులకు రైతులందరూ సహకరించాలని కోరారు. ఈ రోడ్డుతో ఆరు గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కాగా, మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సౌరం కరుణాకర్‌ తండ్రి ఇజ్రాయిల్‌ అనారోగ్యంతో గురువారం మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ కందకట్ల నరహరి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి, పూజారి గోవర్దన్‌గౌడ్‌, కిశోర్‌యాదవ్‌, సుతారి బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

సకాలంలో పనులను పూర్తి చేయాలి

వరంగల్‌ : విలీన గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలో విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. హామీ, పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పనులతో పాటు పారిశుధ్యం, జంక్షన్ల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదం పొందిన పనులకు వెంటనే టెండర్‌ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించా రు. మిషన్‌ భగీరథ పనులను అన్ని గ్రామాల్లో వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌ ల్యాదళ్ల బాలయ్య, ఎస్‌ఈ విద్యాసాగర్‌, ఈఈ శ్రీనివాస్‌రావు, డీఈ నరేందర్‌, రవీందర్‌, ఏఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top