Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విష్ణుప్రియకు వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

విష్ణుప్రియకు వేధింపులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

మియాపూర్‌ , మే 22 : సోషల్‌ మీడియాలో వేధింపుల పట్ల ప్రముఖ నటి విష్ణుప్రియ మియాపూర్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా తనపై కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని, తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ పోస్టులు ప్రచారం అవుతున్నాయని ఈ నెల 18న విష్ణుప్రియ మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.

అలాంటి వ్యక్తులకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించింది. విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana