Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యాక్సిన్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు

వ్యాక్సిన్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు

మన్సూరాబాద్‌, మే 5 : వ్యాక్సిన్‌ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. 40 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్‌ డివిజన్‌ పరిధి, నువ్వులబండలోని బస్తీ దవాఖానలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటు జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టు కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌, కరోనా టెస్టుల కోసం వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్‌లో నిల్చోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ చేయించుకున్నప్పటికీ మా స్కు ధరించడం, చేతులను కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మానవద్దని ఆయన తెలిపారు.

వ్యాక్సినేషన్‌, కరోనా టెస్టుల కేంద్రాల వద్ద ప్రజలు ఎండ బారినపడకుండా ఉండేందు కు టెంట్లు వేయించడంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సతీశ్‌యాదవ్‌, నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్‌, రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana