Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Watch: మహిళను చేతుల్లో మోసి ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీస్‌ అధికారి.. వెనుక ఖాళీగా పోలీస్‌   వాహనం, రీల్‌ స్టంట్‌గా విమర్శలు

Watch: మహిళను చేతుల్లో మోసి ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీస్‌ అధికారి.. వెనుక ఖాళీగా పోలీస్‌ వాహనం, రీల్‌ స్టంట్‌గా విమర్శలు

క్నో: రోడ్డు ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయిన మహిళను ఒక పోలీస్‌ అధికారి చేతుల్లో మోసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఖాళీగా ఉన్న పోలీస్‌ వాహనం ఆయనను అనుసరించింది.

ఈ నేపథ్యంలో సహాయం కోసం పోలీస్‌ వాహనాన్ని ఆ అధికారి వినియోగించకపోవడంతో రీల్‌ స్టంట్‌గా నెటిజన్లు విమర్శించారు. (Police Carries Injured Woman In Arms) ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్‌ 28న మధ్యాహ్నం వేళ థాలియా గ్రామం సమీపంలో 55 ఏళ్ల గాయత్రీ దేవిని ఒక వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయపడిన ఆమె స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడి ఉన్నది.

కాగా, గస్తీ విధుల్లో ఉన్న ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ సింగ్, గాయపడి స్పృహ కోల్పోయిన ఆ మహిళను గమనించారు. వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నారు. నడుచుకుంటూ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

మరోవైపు ఆ పోలీస్‌ అధికారి స్పందించి ఆ మహిళకు సహాయం అందించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆయన చేసిన సహాయాన్ని కొందరు ప్రశంసించారు. అయితే పోలీస్‌ అధికారి స్వయంగా చేతుల్లో ఆ మహిళను మోసే బదులు వెనుక ఖాళీగా వస్తున్న పోలీస్‌ వాహనంలో వేగంగా ఆసుపత్రికి తరలించకపోవడంపై పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.

ఆ పోలీస్‌ అధికారి చర్యను రీల్‌ స్టంట్‌గా కొందరు అభివర్ణించారు. 'ఎక్కువ మంది ఫాలోవర్లను పొందడానికే ఈ పీఆర్ కార్యక్రమమా?' అని ఒకరు ప్రశ్నించారు. ఆ మహిళను పోలీస్‌ వాహనంలో తరలించినట్లయితే 'సింగం' స్టైల్‌ ఫొటో మిస్‌ అయ్యేదిగా అంటూ మరొకరు ఎద్దేవా చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana