లక్నో: ఒక వ్యక్తి మరో మహిళతో కలిసి కారులో ఒక పార్క్ వద్దకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు వెంటనే అక్కడకు వచ్చింది. ప్రియుడ్ని నిలదీసింది.
కారులో పారిపోయేందుకు అతడు ప్రయత్నించగా బోనెట్‌పైకి ఆమె దూకింది. (Woman Jumps On Car Bonnet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి గోమతీ నగర్‌లోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్దకు కారులో వెళ్లాడు. ఇది తెలుసుకున్న అతడి ప్రియురాలు అక్కడకు చేరుకున్నది. ప్రియుడు తనను మోసగించడంపై ఆమె నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
కాగా, ఆ వ్యక్తి కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన ప్రియురాలు అతడ్ని అడ్డుకునేందుకు కారు ముందు నిల్చొన్నది. ప్రియుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నువ్వు ఏం చేసినా సరే, నేను చావను. కారు ఆపు' అని బోనెట్‌పై చేతితో కొడుతూ గట్టిగా అరిచింది.
అయితే కారు డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి కొన్ని నిమిషాలు పాటు మెల్లగా నడిపాడు. దీంతో బోనెట్‌పై ఉన్న ఆ మహిళ వెనక్కి నడిచింది. ఆ తర్వాత అతడు వేగం పెంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కారు బోనెట్‌పైకి జంప్ చేసిన ఆ యువతి అదుపుతప్పి రోడ్డుపై పడింది. స్వల్పంగా గాయపడింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కొందరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

