Dailyhunt
Watch: స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?

Watch: స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?

న్యూఢిల్లీ: ఒక బాలుడు స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. మంచాన్ని పట్టుకుని దానిని వదలలేదు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్‌కు తీసుకెళ్లారు.

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (Kid Refuses To Go To School) ఒక బాలుడు స్కూల్‌కు వెళ్లబోనని మొండికేశాడు. పడుకున్న మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతకీ దానిని వదలలేదు.

కాగా, ఆ బాలుడ్ని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు. ఆ విద్యార్థిని మంచంతో సహా స్కూల్‌కు తరలించారు. స్కూల్‌ లోపలకు వెళ్తున్న విద్యార్థులు గేట్‌ వద్ద అతడ్ని చూసి నవ్వుకున్నారు.

మరోవైపు ఆ బాలుడ్ని మంచం పట్టు నుంచి వదిలించేందుకు ఒక టీచర్‌ కూడా ప్రయత్నించాడు. అయినప్పటికీ స్కూల్‌కు వెళ్లబోనన్న మొండిపట్టును అతడు వీడలేదు. అయితే ఇది ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.

/strong>

Groom's Mother Elopes With Bride's Father | నిశ్చితార్థానికి ముందు.. వధువు తండ్రితో పారిపోయిన వరుడి తల్లి

woman gang-raped | మహిళపై మత్తు మందు చల్లి.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ

Nitish Kumar | 'నేను నా కుటుంబం కోసం పని చేయలేదు'.. ఎన్నికలకు ముందు నితీశ్‌ వీడియో సందేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana