Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
whitest paint : ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్‌..!

whitest paint : ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్‌..!

కాలిఫోర్నియా : (whitest paint) అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్‌ను తయారుచేశారు. ఈ పెయింట్‌ సూర్య కిరణాలను 95.5 శాతం వరకు ప్రతిబింబిస్తుంది. గదిని చలువ చేయడంలో సహకరిస్తుంది.

ఇది గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని నాణ్యత కారణంగా ఈ పెయింట్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

అమెరికా పాడ్రూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ జియులిన్‌ రువాన్‌కు ఏడేండ్ల క్రితం వచ్చిన ఆలోచన మేరకు అతి తెలుపైన పెయింట్‌ను తయారు చేయడానికి నడుం బిగించాడు. ఇంధన పొదుపు, వాతావరణ మార్పు వంటి సమస్యలకు పరిష్కారంగా తెల్లటి పెయింట్‌ తయారీని రువాన్‌ బృందం ప్రారంభించింది. బేరియం సల్ఫేట్‌ అధికంగా వినియోగించి అతి తెల్లటి పెయింట్‌ను సిద్ధం చేశారు. దీనితో పెయింట్‌ చేసిన గోడపై 95.5 శాతం సూర్య కిరణాలను ప్రతిబింబిస్తుంది. ఈ పెయింట్ భవనం పైకప్పు, గోడలపై వేయడం ద్వారా వేసవి కాలంలో గదులను చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ పెయింట్‌ గది ఉష్ణోగ్రతను 18 డిగ్రీల వరకు తగ్గిస్తుందని పరిశోధక బృందం తెలిపింది. ఈ పెయింట్‌ అందుబాటులోకి వస్తే ఖరీదైన ఎయిర్ కండీషనర్ల అవసరం ఉండదని వారు భావిస్తున్నారు.

ఈ పెయింట్‌ చౌకగా తయారవుతున్నందున సరసమైన ధరకు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచడం సులభం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎక్కువ కాలం మన్నే ఈ పెయింట్.. వాణిజ్య పెయింట్ కంటే చౌకగా, సులభంగా తయారుచేయవచ్చని రువాన్ చెప్పారు. నాణ్యత కారణాలతో దీని పేరును గిన్నీస్‌ రికార్డుల్లో నమోదు చేశారు. గదులకే కాకుండా కార్లు, టవర్లపై కూడా ఈ పెయింట్‌ వేసి చల్లబరుచుకోవచ్చు. అయితే, ఇది శీతాకాలంలో సమస్యలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

బాధితురాలి బట్టలు ఉతకమని నిందితుడికి శిక్ష

కొవిడ్‌ మృతుల జ్ఞాపకార్ధం 6 లక్షల తెల్ల జెండాలు

గాంధీ-అంబేడ్కర్‌ మధ్య పుణె ఒప్పందం.. దళితులకు 2 ఓట్లు రద్దు

విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!

ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana