Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాప్‌తో యూరియా అక్రమాలకు బ్రేక్‌.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యాప్‌తో యూరియా అక్రమాలకు బ్రేక్‌.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలకు, బ్లాక్‌ మారెటింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

అదివారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న ఆధార్‌ విధానానికి స్వస్తి చెప్పి, ఈ దఫా భూ అనుసంధాన విధానం ద్వారా నిజమైన సాగుదారులకే యూరియా అందేలా చర్యలు చేపట్టామని అన్నారు.

ప్రస్తుతం 3.39 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా 17.7 లక్షల మంది రైతులు యాప్‌ ద్వారా 59.78 లక్షల బ్యాగుల యూరియాను బుక్‌ చేసుకున్నారని, ఇందులో 52.86 లక్షల బ్యాగులను ఇప్పటికే కొనుగోలు చేశారని చెప్పారు. వ్యవసాయ రంగంలో మరిన్ని ఐటీ ఆవిషరణలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని మంత్రి తెలిపారు. ఏఐ, ఉపగ్రహ సాంకేతికత ద్వారా రైతులకు వాతావరణ సమాచారం, పంటల పర్యవేక్షణ, ఎరువుల పంపిణీ సేవలను ఒకే డిజిటల్‌ వేదికపైకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఫ్రోజన్‌ సీమెన్‌ బుల్‌స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి శ్రీహరి

హైదరాబాద్‌, జూలై 5 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కంసాన్‌పల్లి గ్రామంలో నిర్మించిన ఫ్రోజన్‌ సీమెన్‌ బుల్‌స్టేషన్‌ను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను, దాని పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం పశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన షెడ్లను మంత్రి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలు, గుడ్లు, మాంసం తదితర వివరాలకు సంబంధించిన ప్రగతిని అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, లైవ్‌ స్టాక్‌ చైర్మన్‌ చరణ్‌ కౌశిక్‌, అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana