Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Yadadri Bhuvanagiri | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బీబీనగర్‌లో బీఆర్ఎస్ మహా ధర్నా

యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్ధతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళలనకు దిగుతున్నారు.

తాజాగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గులాబీ పపార్టీ మహా ధర్నా చేపట్టి ధాన్యం బస్తాలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ప్లకార్డ్ లతో ధర్నాప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు.

ఆరుగాలం కష్టపడి పండిస్తే కాంటాలు పెట్టకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహా ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana