Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధం ముగింపునకు ఏడు రోజుల ప్రణాళిక.. అమెరికాకు ఇరాన్‌ ప్రతిపాదన

యుద్ధం ముగింపునకు ఏడు రోజుల ప్రణాళిక.. అమెరికాకు ఇరాన్‌ ప్రతిపాదన

టెహ్రాన్‌: యుద్ధం ముగించడానికి ఇరాన్‌ ఏడు రోజుల ప్రణాళికను అమెరికాకు ప్రతిపాదించింది. మొదట పోరాటం ఆగితే, తర్వాత చమురు అమ్మకాలపై ఆంక్షలను సడలించవచ్చంది.

ఏడో రోజున హొర్ముజ్‌ జలసంధిని తెరచి, ఆ తర్వాత తమ దేశ అణు కార్యక్రమంపై చర్చలు జరపొచ్చని తెలిపింది. ఇక ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలా వద్దా అనేది అమెరికానే నిర్ణయించాలని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ అన్నారు.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ మధ్యవర్తిత్వ దేశాల ద్వారా అమెరికాకు ఈ ప్రతిపాదనను పంపారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ ఈ ప్రతిపాదన చేసింది. తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana