Dailyhunt
ఈటలకు గ్రూపుల పోటు..

ఈటలకు గ్రూపుల పోటు..

- బీజేపీని నమ్మకుండా సొంత ఇమేజ్‌తోనే ముందుకు
- ముఖ్యనేతల మధ్య దూరం..ఈటలపై ప్రభావం
- రాజేందర్‌ను ఓడగొట్టేందుకు లోలోన ప్రయత్నాలంటూ ప్రచారం
- కేసీఆర్‌కు ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమూ ఎఫెక్టే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హుజూరాబాద్‌లో తనకున్న సొంత ఇమేజ్‌, అధికార పార్టీలో అన్యాయం జరిగిందనే సానుభూతితో ఎన్నికల ప్రచారంలో నెటుకొస్తున్న ఈటలకు బీజేపీ నేతల నుంచే ఇబ్బంది ఎదురవుతున్నది.

బాహాటంగానే ఈ ప్రచారం జరుగుతున్నది. ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా ఇబ్బందులే తలెత్తుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు హుజూరాబాద్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇప్పించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడం ఈటలకు మైనస్‌గా మారింది. అదే సమయంలో ఉప ఎన్నిక జరుగుంటే సానుభూతితో ఈటల భారీ మెజార్టీతో గెలిసే అవకాశముండేదనే చర్చా నడిచింది. ఎన్నిక నిర్వహణ లేటయ్యే కొద్దీ ఆయనకు సానుభూతి క్రమంగా తగ్గుతూపోయింది. ప్రచార పర్వంలోనూ బీజేపీ రాష్ట్ర ముఖ్యనాయకులు కలిసికట్టుగా కాకుండా తమ వ్యక్తిగత అజెండాతో పాల్గొనట్టు అర్ధమవుతున్నది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మధ్య సఖ్యత లేకపోవడమూ ఈటలకు ఇబ్బందిగా మారింది. ఆ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాల తాకిడీ ఆయనను వదలట్లేదు. బీజేపీలో ఈటల చేరిక దగ్గర నుంచి నేటి వరకూ ఆయనకు ఆ పార్టీలో సముచిత స్థానం దక్కట్లేదన్న విమర్శ ఉంది. చేరిక సందర్భంలోనూ ఆయన కేంద్ర అధిష్టానం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనీ, ఏదైతే ఆత్మగౌరవం పేరుతో టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చారో ఆ గౌరవం దక్కలేదనే అపవాదుంది. ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాల్సిన ఈటల రాజేందర్‌.. ఏమైందో ఏమోగానీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో చేరాల్సి వచ్చింది. బీసీల్లో బలమైన నేతగా ముద్రపడ్డ ఈటల రాకతో బీజేపీలోని రాష్ట్ర కీలక నేతల్లోనూ తమ భవిష్యత్‌పై రాజకీయ అలికిడి మొదలైంది. తమ పదవులకు ఎక్కడ ఎసరొస్తుందో? తమ రాజకీయ ఉనికికి ఎక్కడ ప్రమాదం పొంచుకువస్తుందో? అనే భయంతో ఈటలను ఓడించేందుకు కొందరు బీజేపీ అగ్ర నేతలు లోలోపల ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ఆ పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలూ దానికి ఊతమిస్తున్నాయి. ఈటల రాజీనామా చేసి వెంటనే తన శక్తియుక్తులు కూడగట్టుకుని ఊరూరా తిరుగుతుంటే ఆయనకు మైలేజ్‌ ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో పుట్టుకొచ్చిందే ప్రజాసంగ్రామ యాత్ర అని గుసగుసలూ వినిపించాయి. ఈటలకు మీడియాలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కకుండా చేయడంలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు పాదయాత్ర మొదలుపెట్టి ప్రచారమాద్యమాల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడనే విమర్శలున్నాయి. అంతకుముందే రాష్ట్రంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నిర్వహించిన విషయం విదితమే. బీజేపీ జాతీయ అధిష్టానం సూచనమేరకే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టినట్టు కిషన్‌రెడ్డి అప్పట్లో చెప్పుకున్నప్పటికీ అది చేపట్టిన సందర్భమే సరిగాదనే వాదన ఉంది. ఓపక్క రాష్ట్రంలో కీలకమైన హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అడిగిన వెంటనే సీఎం కేసీఆర్‌కు వరుసగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్లు ఇచ్చేశారు. అదే సందర్భంతో ఏపీ సీఎం జగన్‌కు అపాయింట్‌మెంట్‌ అడిగినా, ఢిల్లీలో పడిగాపులు గాసినా ఆయనకు వారి దర్శనభాగ్యం దక్కలేదు. అదే కేసీఆర్‌కు వారు వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం రాజకీయంగా ఈటలకు కొంత ఇబ్బందికరంగా మారింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న భావనా ప్రజల్లో మొదలైంది. ఇది ఈటల రాజేందర్‌ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ప్రచారం జరుగుతున్నది.

- బీజేపీని నమ్మకుండా సొంత ఇమేజ్‌తోనే ముందుకు
- ముఖ్యనేతల మధ్య దూరం..ఈటలపై ప్రభావం
- రాజేందర్‌ను ఓడగొట్టేందుకు లోలోన ప్రయత్నాలంటూ ప్రచారం
- కేసీఆర్‌కు ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమూ ఎఫెక్టే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హుజూరాబాద్‌లో తనకున్న సొంత ఇమేజ్‌, అధికార పార్టీలో అన్యాయం జరిగిందనే సానుభూతితో ఎన్నికల ప్రచారంలో నెటుకొస్తున్న ఈటలకు బీజేపీ నేతల నుంచే ఇబ్బంది ఎదురవుతున్నది. బాహాటంగానే ఈ ప్రచారం జరుగుతున్నది. ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా ఇబ్బందులే తలెత్తుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు హుజూరాబాద్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇప్పించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడం ఈటలకు మైనస్‌గా మారింది. అదే సమయంలో ఉప ఎన్నిక జరుగుంటే సానుభూతితో ఈటల భారీ మెజార్టీతో గెలిసే అవకాశముండేదనే చర్చా నడిచింది. ఎన్నిక నిర్వహణ లేటయ్యే కొద్దీ ఆయనకు సానుభూతి క్రమంగా తగ్గుతూపోయింది. ప్రచార పర్వంలోనూ బీజేపీ రాష్ట్ర ముఖ్యనాయకులు కలిసికట్టుగా కాకుండా తమ వ్యక్తిగత అజెండాతో పాల్గొనట్టు అర్ధమవుతున్నది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మధ్య సఖ్యత లేకపోవడమూ ఈటలకు ఇబ్బందిగా మారింది. ఆ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాల తాకిడీ ఆయనను వదలట్లేదు. బీజేపీలో ఈటల చేరిక దగ్గర నుంచి నేటి వరకూ ఆయనకు ఆ పార్టీలో సముచిత స్థానం దక్కట్లేదన్న విమర్శ ఉంది. చేరిక సందర్భంలోనూ ఆయన కేంద్ర అధిష్టానం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనీ, ఏదైతే ఆత్మగౌరవం పేరుతో టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చారో ఆ గౌరవం దక్కలేదనే అపవాదుంది. ఆ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాల్సిన ఈటల రాజేందర్‌.. ఏమైందో ఏమోగానీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో చేరాల్సి వచ్చింది. బీసీల్లో బలమైన నేతగా ముద్రపడ్డ ఈటల రాకతో బీజేపీలోని రాష్ట్ర కీలక నేతల్లోనూ తమ భవిష్యత్‌పై రాజకీయ అలికిడి మొదలైంది. తమ పదవులకు ఎక్కడ ఎసరొస్తుందో? తమ రాజకీయ ఉనికికి ఎక్కడ ప్రమాదం పొంచుకువస్తుందో? అనే భయంతో ఈటలను ఓడించేందుకు కొందరు బీజేపీ అగ్ర నేతలు లోలోపల ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ఆ పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలూ దానికి ఊతమిస్తున్నాయి. ఈటల రాజీనామా చేసి వెంటనే తన శక్తియుక్తులు కూడగట్టుకుని ఊరూరా తిరుగుతుంటే ఆయనకు మైలేజ్‌ ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో పుట్టుకొచ్చిందే ప్రజాసంగ్రామ యాత్ర అని గుసగుసలూ వినిపించాయి. ఈటలకు మీడియాలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కకుండా చేయడంలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు పాదయాత్ర మొదలుపెట్టి ప్రచారమాద్యమాల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడనే విమర్శలున్నాయి. అంతకుముందే రాష్ట్రంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నిర్వహించిన విషయం విదితమే. బీజేపీ జాతీయ అధిష్టానం సూచనమేరకే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టినట్టు కిషన్‌రెడ్డి అప్పట్లో చెప్పుకున్నప్పటికీ అది చేపట్టిన సందర్భమే సరిగాదనే వాదన ఉంది. ఓపక్క రాష్ట్రంలో కీలకమైన హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అడిగిన వెంటనే సీఎం కేసీఆర్‌కు వరుసగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్లు ఇచ్చేశారు. అదే సందర్భంతో ఏపీ సీఎం జగన్‌కు అపాయింట్‌మెంట్‌ అడిగినా, ఢిల్లీలో పడిగాపులు గాసినా ఆయనకు వారి దర్శనభాగ్యం దక్కలేదు. అదే కేసీఆర్‌కు వారు వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం రాజకీయంగా ఈటలకు కొంత ఇబ్బందికరంగా మారింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అన్న భావనా ప్రజల్లో మొదలైంది. ఇది ఈటల రాజేందర్‌ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ప్రచారం జరుగుతున్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana