- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి నవతెలంగాణ - హలియా : అనుముల మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం హాలియాలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన భారతదేశానికి ఐటి రంగాన్ని పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి అదే విధంగా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కరేడ్ల నరసింహ కాసర్ల గిరి శ్రీహరి శివ అజయ్ బ్రహ్మీ తదితరులు పాల్గొన్నారు.

