Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

191 మందికి కరోనా... ఒకరి మరణం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా 191 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,808 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్‌-19 మీడియా బులెటిన్‌ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 41,682 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో4,835 మందికి పరీక్షలు నిర్వహించారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

మరో 2,784 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,968 యాక్టివ్‌ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 49 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. మరో మూడు జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.
14 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో మంగళవారంతో పోలిస్తే బుధవారం 14 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌ నగర్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ - మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో కేసులు పెరిగాయి.
13 జిల్లాల్లో తగ్గిన కేసులు
రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో సహా జగిత్యాల, ఖమ్మం, మెదక్‌, ములుగు, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana