హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. కాగా, బంగాళాఖాతంలో తుఫాన్ దూసుకురానుంది.
ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటనుంది. ఈ తుఫాన్‌కు పాకిస్తాన్ సూచించిన 'గులాబ్' పేరు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 790 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.

