Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
50 ఏండ్ల మాజా

50 ఏండ్ల మాజా

భారతీయులకు అసలైన మామిడి రుచిని అందిస్తున్న మాజా® 50 వసంతాలను కోకా-కోలా ఇండియా వేడుక చేసుకుంటోంది. 1976లో ప్రారంభమైనప్పటి నుండి మాజా®, అద్భుతమైన రుచి, చిన్ననాటి జ్ఞాపకాలు, పూర్తిగా భారతీయత ఉట్టిపడే క్షణాల బలమైన వారసత్వంతో, మామిడి పండ్లపై భారతీ యులకున్న ప్రేమతో తనను తాను గాఢంగా ముడివేసుకుంది.

ఐదు దశాబ్దాలుగా, వేసవి కాలపు మధ్యాహ్నాలు, కుటుంబ వేడుకలు మొదలుకొని నుండి చిన్న చిన్న రోజు వారీ ఆనందాల వరకు… తరాల పొడుగునా మాజా® ఒక సుపరిచితమైన తోడుగా నిలిచింది. కాలక్రమేణా, ఈ బ్రాండ్ కేవలం ఒక పానీయంగానే కాకుండా, ఎంతో సాంత్వనను, గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చే స్వదేశీ మామిడి పండు మధురమైన రుచికి ప్రతీకగా మారింది.

కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా మార్కెటింగ్ (న్యూట్రిషన్) సీనియర్ డైరెక్టర్ సునైనీకా సింగ్ మాట్లా డుతూ, ''భారతీయుల జీవితాల్లో, వారి ఇళ్లలోని షెల్ఫ్లలో, మధురజ్ఞాపకాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకోడా నికి మాజా® అర్ధ శతాబ్దాన్ని వెచ్చించింది. వేసవి సెలవుల్లో, కుటుంబ వేడుకల్లో, ఆదివారం మధ్యాహ్నం భోజనం తర్వాత తినే డెజర్ట్లలో, పండుగ విందుల్లో, ఫోటో తీయడానికి వీలుపడనంత చిన్నవైన మరిచిపోలేనంత అద్భుతమైన క్షణాల్లో మాజా® ఎప్పుడూ తోడుగా ఉంది. ప్రతి దశాబ్దంలోనూ మాజా®ను అసాధారణమైనదిగా నిలబెట్టింది ఏమిటంటే, అది పూర్తిగా తనదైన శైలిని కాపాడుకుంటూ రావడం: నిజాయితీతో కూడిన, మధురమైన అనుభూతిని ఇస్తూ, అసలైన మామిడి పండును తింటున్న భావనకు అత్యంత దగ్గరగా ఉండటం. ఆ నమ్మకం 50 ఏళ్లుగా నిర్మితమైంది, రాబోయే 50 ఏళ్లకు మనకు కావలసిన ఏకైక పునాది ఇదే'' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana