హైదరాబాద్ : ప్రపంచవ్యాప్త కరోనా పాజిటివ్ కేసులు 70 లక్షలకు చేరువయ్యాయి. 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 69 లక్షల 74 వేల 721 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 31 లక్షల 61 వేల 346గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా 4 లక్షల 2 వేల 94 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 34 లక్షల 11 వేల 281 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా కారణంగా అత్యధిక ప్రభావానికి గురైతుంది. యూఎస్‌ఏలో కొత్తగా 20,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 19.88 లక్షలు దాటింది. వ్యాధి కారణంగా అమెరికాలో ఇప్పటివరకు ఒక లక్షా 12 వేల 96 మంది చనిపోయారు.

