నవతెలంగాణ - వర్ధన్నపేటకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ వర్ధన్నపేట బస్టాండ్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఆదరణకు నోచుకోలేదు.
వ్రత నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహాలను పక్కన పెట్టారు. అప్పటినుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ, తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాలను పట్టించుకున్న పాపాన పోలేదు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న గులాబీ నేతలు సైతం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పట్టించుకోవడం లేదు.
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం కొత్త బస్టాండ్ లో ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జయంతి వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి చేతిలో దులుపుకుంటున్నారటప్ప దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేతలను కనీసం గుర్తించి విగ్రహాలను ఏర్పాటు చేయడం లేదని వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆదరణ కరువైందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
దేశ పురోభివృద్ధికి, సాంకేతిక విప్లవానికి బాటలు వేసిన దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. రోడ్డు వెడల్పు పనుల పేరుతో పక్కన పడేసిన విగ్రహాన్ని తిరిగి సగౌరవంగా ప్రతిష్టించకపోవడంపై స్థానిక ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రత్యేకంగా, సగౌరవంగా ఏర్పాటు చేయకపోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రోడ్డు వెడల్పు పనులు ముగిసి రోజులు గడుస్తున్నా, విగ్రహ పునఃప్రతిష్టకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
బస్టాండ్ భద్ర ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పూర్తి గౌరవప్రదంగా, ప్రత్యేక వేదిక (ప్లాట్ఫామ్) నిర్మించి పునఃప్రతిష్టించాలనీ సైనికుల డిమాండ్ చేస్తున్నారు. విగ్రహం చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలనీ స్థానికులు కోస్తున్నారు రాజకీయాలకు అతీతంగా దేశానికి సేవ చేసిన మాజీ ప్రధాని విగ్రహం ఇలా రోడ్డు పక్కన పడి ఉండటంపై సాధారణ ప్రజలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్, జాతీయ రహదారుల అధికారులు స్పందించి, వర్ధన్నపేట కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సగౌరవంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

