Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆధునిక భారత నిర్మాణ శిల్పి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

ఆధునిక భారత నిర్మాణ శిల్పి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

వతెలంగాణ - వనపర్తి : భారత దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణ శిల్పి అని, యువతకు స్ఫూర్తి ప్రదాత అయ్యారని, ఆయన ఆశయాల సాధన కోసం అందరం కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సూచించారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనరెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఎంతో కీలకమైనదని, కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, సమాచార సాంకేతికత అభివృద్ధికి బాటలు వేసిన మహానేతగా ఆయన చిరస్మరణీయులు.

అని వారు ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధి, విద్య, యువత సాధికారత, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. యువ భారతానికి కొత్త దిశను చూపిస్తూ దేశ అభివృద్ధి కోసం ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆశయాలు, సేవా తత్వం నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana