Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆద్యంతం వినోదభరితంగా సాగే సరికొత్త సిరీస్

ఆద్యంతం వినోదభరితంగా సాగే సరికొత్త సిరీస్

జీ5 తెలుగు నుంచి 'మేము కాప్'లం' అనే మరో ఒరిజినల్ సిరీస్ వచ్చింది. రా ఎంటర్టైన్మెంట్స్ (ప్రొడక్షన్ నెం. 3) బ్యానర్పై బి.వి.ఎస్. రవి నిర్మించిన ఈ సిరీస్కు 'వికటకవి' ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు.

ఈ సిరీస్లో నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రను పోషించారు. గెటప్ శ్రీను, రవి తేజ నన్నిమాల వంటి ప్రముఖ తారాగణం నటించారు. ఈ సిరీస్ నేటి (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ను నిర్వహించారు.

తమన్ మాట్లాడుతూ,'సాకేత్ ఈ సిరీస్కు సంగీతం అందించడం, ధ్రువన్ పాటలు రాయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'ట్రైలర్ మాత్రం వినోదాత్మకంగా ఉంది. కామెడీ వెబ్ సిరీస్లు చాలా తక్కువగా వస్తున్నాయి. 17 రోజుల్లోనే ఇలాంటి క్వాలిటీతో తీయడం అంటే మామూలు విషయం కాదు` అని అజయ్ భూపతి చెప్పారు.బండ్ల గణేష్ మాట్లాడుతూ, 'ఈ సిరీస్కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.

కేవలం 17 రోజుల్లోనే సిరీస్ తీశారంటే నమ్మలేకపోయా. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.'అనురాధ ఎప్పుడూ కూడా మంచి కంటెంట్ను ఎంచుకుంటారు. ఇదొక రిఫ్రెషింగ్ కంటెంట్లా ఉంది. రవికి అన్ని క్రాఫ్టుల మీద పట్టుంది.

ప్రతీ ఒక్కరికీ ఈ సిరీస్ నచ్చుతుంది` అని కోన వెంకట్ చెప్పారు.నిర్మాత కౌముది మాట్లాడుతూ, 'మాకు ఈ అవకాశం ఇచ్చిన అనురాధకి థ్యాంక్స్. ప్రదీప్ వల్లే ఈ ప్రాజెక్ట్ మా వరకు వచ్చింది. పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నా మాకు నాగబాబు డేట్స్ అడ్జస్ట్ చేశారు` అని తెలిపారు.'నాగబాబు ఈ ప్రాజెక్ట్లోకి రావడంతోనే మా సిరీస్ స్థాయి, విలువ పెరిగింది. మా సిరీస్ ఆనందంగా, ఆహ్లాదంగా, సరదాగా ఉంటుంది` అని నిర్మాత బీవీఎస్ రవి చెప్పారు.

జీ5 బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ,'ఈ ఏడాదిలో మా నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్తో ఫ్యామిలీ ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా, ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది` అని అన్నారు.'ఈ సిరీస్ను ప్రతీ ఒక్కరి సపోర్ట్తోనే ఇంత వేగంగా పూర్తి చేయగలిగాం. మా జర్నీలో నాగబాబు అండగా నిలిచారు. అందరూ చూసి ఎంజాయ్ చేయండి' అని డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana