నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆగస్టు నెలాఖరుకల్లా రాష్ట్రంలో ఆరవ విడత హరితహారం లక్ష్యాలను పూర్తిచేయాలని అన్ని జిల్లాల అటవీ అధికారులను టీసీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశించారు. హరితహారం అమలుపై గురువారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరవ విడతలో జిల్లాల వారీగా అప్పగించిన అక్ష్యాలు, సాధించిన పురోగతిని సమీక్షించారు. కామారెడ్డి, వరంగల్, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలు మొక్కలు నాటడంలో వెనుకబడిన కారణాలను ఆమె ఆరా తీశారు. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయం పనులు, కరోనా, ఉపాధి కూలీల వందరోజుల గడువు ముగియడంతో ప్లాంటేషన్ కార్మికుల కొరత ఉత్పన్నమైందని జిల్లాల అధికారులు వెల్లడించారు.
హరితహారం తీరు తెన్నులను ప్రత్యేక అధికారి ఆర్‌ఎం.దోబ్రియాల్ ఆమెకు వివరించారు. ఈ ఏడాది హరితహారం మొత్తం లక్ష్యం 29.86 కోట్ల మొక్కలుకాగా ఇప్పటి వరకు 21.06 కోట్ల మొక్కలునాటి నట్టు తెలిపారు. లక్ష్యంలో 70.5 శాతం చేరుకున్నట్టువివరించారు.
