Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆకుల్లా కనిపించే అరుదైన కీటకం

ఆకుల్లా కనిపించే అరుదైన కీటకం

వతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీఆకును పోలిన శరీర నిర్మాణం, రంగుతో కనిపించిన ఈ కీటకాన్ని 'లీఫ్ ఇన్సెక్ట్' (Walking Leaf), గా గుర్తించారు. ఇది Phylliidae కుటుంబానికి చెందినది.

చెట్టు ఆకులను పోలిన ఆకారం, రంగు ఉండటం వల్ల శత్రువుల కంటపడకుండా ప్రకృతిలో కలిసిపోయే అద్భుతమైన మభ్యపెట్టుకునే సామర్థ్యం (Camouflage) ఈ కీటకానికి ఉంది. దీని శరీరం, కాళ్లు కూడా ఎండిన లేదా పచ్చని ఆకుల్లా కనిపించడం విశేషం. ఈ అరుదైన కీటకం బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లో కనిపించింది. విద్యార్థులు, ఆచార్యులు, ఉద్యోగులు దీన్ని తిలకించేందుకు పోటి పడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana