Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం

ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం

వతెలంగాణ - భిక్కనూర్ (రాజంపేట్) : రాజంపేట్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, బరువు, ఎత్తు, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు అందజేశారు. గర్భాధారణ సమయంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగీత, ఆరోగ్య విస్తీర్ణధికారి ఎండి మంజూరు, సూపర్వైజర్ గంగమణి, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana