Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్థిక సాయంలో అవకతవకలు లేకుండా చూడాలి

ఆర్థిక సాయంలో అవకతవకలు లేకుండా చూడాలి

- మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా
నవతెలంగాణ-జవహర్‌ నగర్‌
ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంలో అవకతవకలు లేకుండా చూడాలని జవహర్‌ నగర్‌ కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద బాధితుల సహాయ నిమిత్తం 10 వేల రూపాయలు వరద బాధితులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినప్పటికీ జవహర్‌ నగర్‌ లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో అధికారులు కార్పొరేటర్లు చేతివాటం ప్రదర్శింస్తున్నారని అన్నారు.

ప్రభు త్వం నుండి బాధితులకు పది వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న ప్పటికీ కార్పొరేటర్ల అనుచరులు డబ్బులు పంచుతున్న అధికారులతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్సస్తు న్నారని అసలైన వరద బాధితులకు డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana