Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరుట్ల దంపతుల సేవలు చిరస్మరణీయం

ఆరుట్ల దంపతుల సేవలు చిరస్మరణీయం

వతెలంగాణ-ఆలేరు టౌన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతుల సేవలు చిరస్మరణీయమని, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు.

ఆలేరు పట్టణంలో బుధవారం ఏఎన్నార్ గార్డెన్ లో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రా రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామానందతీర్థ, రూరల్ ఇన్స్టిట్యూట్ పోచంపల్లి సహకారంతో ఆలేరు నియోజక వర్గ పరిధిలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ రంగాల్లో శిక్షణ పొందిన మహిళలకు,యువతకు ధృవ పత్ర ప్రదానం కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా , వాళ్ళ హక్కుల కోసం నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటంలో ఆరుట్ల దంపతులు చూపిన పోరాట పటిమ గొప్పదని అన్నారు. వాళ్ళు చూపిన దారిలో నడిచే అవకాశం నాకు కలిగింది అన్నారు.

పది గ్రామాలకు చెందిన 500 మంది శిక్షకులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి,స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి,ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్,సీపీఐ నాయకులు దయాకర రెడ్డి,చెక్క వెంకటేశ్ , లింగం గౌడ్,కొల్లూరి రాజయ్య, సంస్థ నిర్వాహకులు ఆరుట్ల సుశీల,ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి, మమత ,ప్రముఖ గాయని యాట సంధ్య ,డాక్టర్ పోరెడ్డి రంగయ్య ,నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana