Dailyhunt
ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ కర్ణాటకపు సమ్మయ్యనవతెలంగాణ - మల్హర్ రావు
అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు ప్రభుత్వం జీవో 421 ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక భూపాలపల్లి జిల్లా కన్వీనర్ కర్ణాటకపు సమ్మయ్య డిమాండ్ చేశారు.శనివారం మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బండారి దేవేందర్ అనే కౌలు రైతు 4-7-2025లో పంటలకు తెచ్చిన అప్పుల బాధతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిపారు.

బాధిత రైతు కుటుంబానికి రైతు స్వరాజ్య వేదిక ద్వారా బాధిత కుటుంబాన్ని పరమార్షించి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ ద్వారా రూ.50 వేలు ఆర్థిక సహాయం చేసి,ఆ డబ్బులతో కుటుంబ జీవనోపాధి కోసం గొర్రెలను కొని అందించి,ఆదుకోవడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబాలకు 421జిఒను అమలు చేస్తూ,రూ.6,లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి,ముక్క ఐలన్న, జిల్లా కో కన్వీనర్ చల్లగురుగుల సంజీవ్,నర్సయ్య పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana