Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభిషేక్ పోరెల్ అరెస్ట్

అభిషేక్ పోరెల్ అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో
 బెంగాల్ పోలీసుల చర్యకోల్కతా : బెంగాల్, ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్) ఆటగాడు అభిషేక్ పోరెల్(23)ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్కతాలో మంగళవారం అభిషేక్ పోరెల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అదేరోజు అతడిని హైకోర్టులో హాజరుపరిచారు. అభిషేక్ పోరెల్పై అత్యాచారం, ఇతర లైంగిక వేధింపుల ఆరోపణలతో జూన్ 30న ఎఫ్ఐఆర్ నమోదైంది. జులై 14న ఈ కేసులో విచారణ సందర్భంగా.. బాధితురాలికి సంబంధించిన ప్రయివేటు వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు అభిషేక్ పోరెల్లో ఉన్నాయని, అవి ఇతరులకు పంపకుండా, వేరే ఎలక్ర్టానిక్ డివైజ్లో స్టోర్ చేయడానికి వీలు లేకుండా స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం పిటిషనరు తరఫున న్యాయవాది వాదనల తర్వాత ఆదేశించింది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అభిషేక్ పోరెల్ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టలేదు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావటంతో అతడి క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana