Dailyhunt
అభివృద్ధి పనులను పరిశీలించిన జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు

అభివృద్ధి పనులను పరిశీలించిన జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు

నవతెలంగాణ-మంథని
మంథని మున్సిపాల్టీ పరిధిలోని బొగ్గుల వాగు కట్ట పైన ఓపెన్ జిమ్ స్థలాన్ని,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సోమవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ మధుకర్, చైర్ పర్సన్ పుట్ట శైలజలు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతకు ఓపెన్ జిమ్, వ్యాపారులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలతో ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తగరం శంకర్ లాల్, నాయకులు గుండ పాపారావు,వికే రవి, నక్క శంకర్,కాయితి సమ్మయ్య, బత్తుల సత్యనారాయణ, సదానందం, కొట్టే రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana