Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నవతెలంగాణ-ఆర్మూర్

భారీ వర్షాల నేపథ్యంలో సంబంధిత అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు.

పట్టణంలో శుక్రవారం డివిజన్ స్థాయి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

చెరువులు వాగులు ఇతర చోట్ల పరిస్థితిని నిశతంగా పర్యవేక్షించాలని విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుందా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇ పరిస్థితుల్లో అధికారుల సన్నద్ధత అప్రమత్తతపై తగు సూచనలు చేశారు . వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనులపై స్వల్పకాలిక సమీక్ష నిర్వహించడం జరిగింది, సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు, సబ్ కలెక్టర్ శ్రీ అభిగ్యన్ మాల్వియా, ఏసీ పి వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఎంపీడీవో శివాజీ లతోపాటు డివిజనల్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana