Dailyhunt
అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో లోపాలపై ఆగ్రహంనవతెలంగాణ - కాటారం

కాటారం మండలంలో అడిషనల్ కలెక్టర్ (LB) శ్రీమతి విజయలక్ష్మి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

గంగారం గ్రామ పంచాయతీలోని తెలంగాణ మోడల్ స్కూల్ను సందర్శించి ఉపాధ్యాయుల హాజరు పత్రాలను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం మెనూ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అనంతరం కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి సేవలపై సమీక్ష నిర్వహించారు. వైద్య సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తదుపరి చిదినేపల్లి గ్రామ పంచాయతీలోని హెల్త్ సబ్ సెంటర్ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్, ఎన్సీడీ (NCD) స్క్రీనింగ్, హెచ్పీవీ వ్యాక్సినేషన్ అమలు స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుట్టు మిషన్ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారికి అందుతున్న శిక్షణపై అవగాహనను ప్రాక్టికల్గా పరీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ మౌనిక ,ఎం పి ఓ వీరాస్వామి సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana