Dailyhunt
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు

- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ- అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్

ఫెర్టిలైజర్, సీడ్ కంపెనీ ఏర్పాటుకు లైసెన్స్ కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఈ ఘటన మంగళవారం రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీబీ డీఎస్పీ గంగసని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి ఫెర్టిలైజర్ సీడ్ కంపెనీ పెట్టడానికి గతేడాది మార్చి 2025లో లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లరు చేసుకున్నాడు. అయితే ఏడాది దాటినా అతనికి లైసెన్స్ రాకపోవడంతో రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అసోసియేషన్ డీన్ మంతటి గోవర్ధన్ను కలిశాడు.

అయితే రూ. లక్షా 25 వేలు ఇస్తే లైసెన్స్ ఇప్పిస్తానని గోవర్ధన్ అతనికి చెప్పడంతో అతను ముందుగా రూ.25 వేలు యూపీఐ పేమెంట్ చేశాడు. దాంతో అతనికి కొద్ది రోజుల క్రితం లైసెన్స్ వచ్చింది. అయితే గోవర్ధన్ మిగతా లక్ష రూపాయల కోసం ఫోన్ చేసి వేధిస్తున్నాడు.

ఫిర్యాదుదారుని దగ్గర లక్ష రూపాయలు లేకపోవడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం ఫిర్యాదుదారునికి లక్ష రూపాయలు ఇచ్చి యూనివర్సిటీలోని గోవర్ధన్ ఛాంబర్కు పంపించారు. అక్కడ ఫిర్యాదుదారుడు గోవర్ధన్కి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదేవిధంగా అతని ఇంట్లో, కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గోవర్థన్రెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana