Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐ పౌండేషన్ ప్రతిభా పురస్కారం అందుకున్న బాలాజీ

ఐ పౌండేషన్ ప్రతిభా పురస్కారం అందుకున్న బాలాజీ

వతెలంగాణ-మద్నూర్ మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలకు చెందిన పదవ తరగతిలో 581 మార్కులను సాధించిన జిల్లా టాపర్ కదం బాలాజీ హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుతారపు రవీందర్, భువనగిరి యం.

పి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, చేతులమీదుగా ఐ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారమును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తో పాటు ప్రిన్సిపాల్ ఏ. సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ ,ప్రముఖ పద్యకవి డా. బి వెంకట్ లను ఐ ఫౌండేషన్సన్మానించింది. ఈరోజుహైదరాబాదులోని రవీంద్రభారతి ప్రధానమందిరంలో జరిగిన ఐ ఫౌండేషన్ ప్రతిభా పురస్కార కార్యక్రమములో అతిథులుగా,ఆచార్య కోదండరాం,శ్రీధర్ కస్తూరి, సామల వేణు, టి.సుభాష్ రెడ్డి, దైవజ్ఞ శర్మ, మహాలక్ష్మీ, ఏ యాదగిరి, డా వెంకటేశ్వర్ రెడ్డి, కమలాకర్ అమర్నాథ్, శాంతికృష్ణ ఆచార్య, గుంపు నాగేశ్వర్ రావు, జి.ప్రభాకర్ లు పాల్గొని, సందేశాలు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ ఏ సుధాకర్ చెప్పారు.33 జిల్లాల నుండి 500 మంది విద్యార్థులను ,500 మంది ప్రధానోపాధ్యాయులను సన్మానించి నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana