Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐడీఏలను వెంటనే చెల్లించాలి

ఐడీఏలను వెంటనే చెల్లించాలి

నిజామాబాద్లో సంచార్ భవన్ వద్ద బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ధర్నా​సంఘీభావం తెలిపిన సీఐటీయూ
నవతెలంగాణ-కంఠేశ్వర్

ఐడీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగులు, ఎన్ఎఫ్టీఈ ఉద్యోగులు, ఎస్ఎన్ఈఏ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో సంచార్ భవన్ వద్ద బుధవారం ధర్నా చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐడీఏను వెంటనే ఇవ్వాలని, అలాగే జనవరి 1 నుంచి పెండింగ్లో ఉన్న ఐడీఏలను వెంటనే చెల్లించాలని, బీఎస్ఎన్ఎల్లో అఫెర్టబిలిటీ కండిషన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్బాబు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కే.రామ్మోహన్రావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ యూనియన్స్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ జిల్లా కన్వీనర్ ఈవీఎల్ నారాయణ, నాయకులు డి.సాయిలు, సాయన్న, చంద్రశేఖర్, రాజేందర్, సందీప్ రాటి, ఎంఎన్వీ అనురాధ, లత, సుభాష్, రిటైర్డ్ ఉద్యోగులు మధుసూదన్, బాల దుర్గయ్య, గంగాధర్, పాండురంగం తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana