Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐఎల్టీ20లో క్లాసెన్, మిల్లర్

ఐఎల్టీ20లో క్లాసెన్, మిల్లర్

స్టోయినిస్, అలెన్ సైతం..దుబాయ్ : ది ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20) టోర్నమెంట్కు స్టార్ కళ రానుంది. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్ ద్వయంతో పాటు ఆస్ర్టేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్, న్యూజిలాండ్ క్రికెటర్ ఫిన్ అలెన్లు సైతం ఐఎల్టీ20లో ఆడేందుకు సై అంటున్నారు.

గల్ఫ్ జెయింట్స్ ప్రాంఛైజీ హెన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్తో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోగా.. ఫిన్ అలెన్ అబుదాబి నైట్రైడర్స్తో చేరనుండగా, మార్కస్ స్టోయినిస్ దుబాయ్ క్యాపిటల్స్కు ఆడనున్నాడు. ఐఎల్టీ20 టోర్నమెంట్ ఐదో సీజన్ ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. సునీల్ నరైన్, జేసన్ హోల్డర్, షిమ్రోన్ హెట్మయర్, ముజీబ్ రెహమాన్, రోవ్మాన్ పావెల్, ముస్తాఫిజుర్ రెహమాన్, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, రొమారియో షెఫర్డ్, రూథర్ఫోర్డ్లు సైతం ఈ లీగ్లో ఆడేందుకు ప్రాంఛైజీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. దీంతో ఐదో సీజన్ అంచనాలకు మించి సాగనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana