Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఐక్య'నా బిడ్డ లాంటిది

'ఐక్య'నా బిడ్డ లాంటిది

హీరో మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదిం చుకున్నారు.

నేడు (బుధవారం) తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 'ఐక్య' పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను సూపర్ మ్యాన్ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్ను పెట్టాలని అనుకున్నాం. వాయిస్ లెస్కి వాయిస్గా ఈ ట్రస్ట్ ఉంటుంది. అలా 'ఐక్య ధైర్య సేనా సమితి' అని పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు. నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి 'ఐక్య ధైర్య సేనా సమితి' అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే. 'ఐక్య' ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది? 'ఐక్య'కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదు. మేం ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం.
'ఐక్య' ఇతర వివరాల్ని ఎప్పుడు ప్రకటిస్తారు? జూన్ 7న నా కొత్త సినిమా 'రక్షక్' ప్రారంభం కాబోతోంది. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే 'ఐక్య'కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను. అంతలోపు 'ఐక్య' కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది?, వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు. మీది, ఎన్టీఆర్, సిరివెన్నెల బర్త్ డే ఒకే రోజు..! నా పుట్టిన రోజుని తారక్ అన్నతో, స్వర్గీయ సిరివెన్నెలతో కలిసి జరుపుకోవడం హ్యాపీ. సిరివెన్నెలకి అంతం అంటూ ఉండదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనలోనే ఉంటారు. మీరు చేస్తున్న సినిమాల గురించి? డేవిడ్ రెడ్డి, వాట్ ది ఫిష్ వంటి భిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈనెలలోనే అధికారికంగా ప్రకటిస్తాను. 'మోహన రాగ మ్యూజిక్` బాగా వస్తోంది. ఇప్పటివరకు 4 పాటలు రికార్డ్ అయ్యాయి. మరో 4 పాటలు రెడీ కావాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana