Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐస్లాండ్ ప్రధానితో పీఎం మోడీ భేటీ

ఐస్లాండ్ ప్రధానితో పీఎం మోడీ భేటీ

వతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్ ఫ్రోస్టాడోట్టిర్తో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు మోడీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ''ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్ ఫ్రోస్టాడోట్టిర్తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఐస్లాండ్తో ఉన్న స్నేహబంధాన్ని భారత్ ఎంతో విలువైనదిగా భావిస్తోంది. స్వచ్ఛ ఇంధనం, మత్స్య రంగం, సస్టైనబిలిటీ, జియోథర్మల్ ఎనర్జీ, కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ వంటి రంగాల్లో సంబంధాలను మరింత మెరుగుపర్చే మార్గాలపై చర్చించాం'' అని తెలిపారు. అలాగే బ్లూ ఎకానమీకి సంబంధించిన రంగాల్లో ఐస్లాండ్ ప్రతిభ ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు. భారత్-ఈఎఫ్టీఏ (EFTA) ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ (TEPA) వాణిజ్య, పెట్టుబడి సంబంధాలకు మరింత ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana