ఖమ్మం: నగరంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ హబ్ జిల్లా యువతకు గొప్ప సదావకాశం అని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఐటీ హబ్ పనుల తీరును హబ్ ఇన్ చార్జితో కలిసి అన్ని అంతస్తులు తిరిగి పరిశీలించారు. అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఖమ్మం ఐటీ హబ్లో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని హబ్ ఇన్ చార్జి కలెక్టర్ కు తెలిపారు.

