హైదరాబాద్
అక్రమ అరెస్టులు హేయమైన చర్య : కాంగ్రెస్, బీజేపీ

నవతెలంగాణ- శామీర్ పేట/ మూడు చింతల పల్లి: గురువారం మూడు చింతలపల్లిలో ధరణి పోర్ట ల్ ఆవిష్కరణ సందర్భంగా మూడు చింతలపల్లి, శామీర్‌పేట మండలాల్లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయ కులను ఇంటలిజెన్స్ మరియు ఎస్‌ఓటీ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి శామీర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే మూడుచింతలపల్లికి ప్రాతి నిధ్యం వహిస్తున్న ఎంపీటీసీ పారుపల్లి నాగరాజును ఇంటలిజెన్స్, ఎస్‌ఓటీ పోలీసులు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు గహ నిర్బంధం చేసి ధరణి పోర్టల్ ప్రారంభించే స్థలానికి తీసుకొచ్చి వదిలేయడం గమనార్హం. ఈ ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి రైతుల సమస్యలపై పోరాటం చేస్తా ఉంటే కనీసం స్పందించకపోవడం చాలా సిగ్గుచేట్టన్నారు.
నా సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కార్యక్రమంలో సమస్యలు విన్నవించుకుందాం అంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఒక తీవ్రవాదిలా ఒక దేశ ద్రోహిలా బలవంతంగా తీసుకెళ్లడం దారుణమ న్నారు. తను దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అయినందు వల్లనే అగ్రకులాల వారైనా టీఆర్‌ఎస్ నాయకులు తనపై తప్పుడు సమాచారం ఇచ్చి అక్ర మంగా అరెస్టు చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజలకు న్యాయం జరిగే వరకు ఎన్ని పోరాటాలు అయినా కొనసాగించి అక్రమ అరెస్టులకు భయప డకుండా సమస్యలపై పోరాడుతానని తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంత పాలనలో ఉన్నామా అని మండిపడ్డారు. అరెస్టయిన వారిలో బీజేపీ ఎంసీపల్లి మండల అధ్యక్షులు నందాల శ్రీనివా స్, ఎస్‌స్సీ మోర్చా నాయకులు డప్పు రతన్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ నాయక్, నాగార్జున్, ఎల్(అరుణ్), రాకేష్, పవన్ గౌడ్, రవి గౌడ్, సాయి ఉన్నారు. గృహనిర్బంధంలో జి. నరేష్ పటేల్,శ్రీపాల్ యోగిలు ఉన్నారు.