- మహిళలపై సుప్రీంకు అపార గౌరవం ఉంది:దుమారం రేపిన వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ బోబ్డే వివరణ
న్యూఢిల్లీ : మహిళలపై సుప్రీంకోర్టుకు ఒక వ్యవస్థగా అత్యంత గౌరవం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ బోబ్డే సోమవారం స్పష్టం చేశారు. రేపిస్టును పెళ్లి చేసుకుంటావా అన్న వ్యాఖ్యలపై పెద్దయెత్తున దుమారం రేగడంతో ఆయన సోమవారం నాడు ఈ వివరణ ఇచ్చారు.
