Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అలయ్ బలయ్ కు హాజరైన ప్రముఖులు

అలయ్ బలయ్ కు హాజరైన ప్రముఖులు

హైదరాబాద్‌ : ప్రతి ఏటా దసరా అనంతరం నిర్వహించే అలయ్‌- బలయ్ కార్యక్రమం ఆదివారం జలవిహార్ లో ప్రారంభమైంది. హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌదర్యరాజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకునేందుకు ఈ అలయ్ బలాయ్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై పలు పార్టీల నేతలు, ప్రముఖులు కలుసుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ మండలి ప్రొటెం చైర్మెన్ భూపాల్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana